నిర్ణీత సమయంలోగా ఏదో ఒకటి తేల్చేయాలి
కమిటీ సందేశం ..శాంతి భద్రతలపై రహస్య నివేదిక

అస్థిరతతో అతలాకుతలమవుతున్న ఆంధ్రప్రదేశ్‌కు సమైక్య మార్గమే శ్రేయోదాయకమని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం దృష్ట్యా చూసినా, జాతీయ దృక్పథంతో ఆలోచించినా కలిసుండడమే ఉత్తమమని పేర్కొంది. అదే సమయంలో... రాష్ట్రంలో 'యథాతథ స్థితి' కొనసాగించడం ఆచరణాత్మకంగా అసంభవమని తెలిపింది. సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏదో ఒకరకమైన మార్పు చేర్పులు అవసరమని స్పష్టంచేసింది. లేకపోతే హింస చెలరేగవచ్చని, తీవ్ర ఆందోళనలు జరగవచ్చని హెచ్చరించింది.
ప్రత్యేక రాష్ట్రం కోసంఉద్యమిస్తున్న తెలంగాణకు రాజ్యాంగ రక్షణలు కల్పించాలని సూచించింది. సమస్యకు ఇదే అత్యుత్తమపరిష్కారమని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 'రెండో ఉత్తమ పరిష్కారం మాత్రమే'నని శ్రీకృష్ణ కమిటీ అంచనా వేసింది. అదేసమయంలో... తప్పనిసరైతేనే రాష్ట్రాన్ని విభజించాలని, దీనికి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య సానుకూలత ఏర్పడాలని అభిప్రాయపడింది. హైదరాబాద్‌తో కలిపి లేదా హైదరాబాద్ లేకుండా... ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా, మావోయిస్టులు,మతఛాందస వాదంతో పాటు అనేక సమస్యలు పెచ్చరిల్లే అవకాశముందని హెచ్చరించింది.
న్యూఢిల్లీ, జనవరి 6 : ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను, కేంద్రం గురువారం బయటపెట్టింది. డిసెంబర్ 30న సమర్పించిన ఈ నివేదికను, ఢిల్లీలో జరిపిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి చిదంబరం, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించారు. ఇంటర్నెట్ ద్వారా ప్రజలకూ అందుబాటులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని సంక్షుభిత వాతావరణాన్ని ఏడాదిపాటు అధ్యయనం చేసిన కమిటీ, ఈ సమస్య పరిష్కారానికి స్థూలంగా ఆరు మార్గాంతరాలను (ఆప్షన్స్) ఆవిష్కరించింది.
తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని పలు వర్గాలు చేసిన డిమాండ్లు, పంపిన నివేదికలను క్రోడీకరించి ఈ పరిష్కారాలను కనుగొంది. అదే సమయంలో ఈఆరు మార్గాలకూ ఉన్న పరిమితులను, అనివార్యతలను కూడా చర్చించింది. తాను సూచించిన వాటిలో తొలి మూడు పరిష్కారాలైన యథాతథ స్థితిని కొనసాగించడం, రాష్ట్రాన్ని విభజించి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం, రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్రగా విభజించడం... ఇవేవీ ఆచరణాత్మకం కావని కమిటీ తానే తేల్చేసింది.
యూటీ సరిహద్దులు విస్తరించి రాష్ట్రాన్ని విభజించడం, ఇప్పుడున్న సరిహద్దుల ప్రకారమే సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను ఇచ్చేయడం... అనే నాలుగు, ఐదు మార్గాంతరాల్లోనూ ప్రతికూలతలను ప్రముఖంగా ప్రస్తావించింది. చివరికి... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, తెలంగాణకు రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించడమనే తన చివరి పరిష్కార మార్గమే అత్యుత్తమైనదని తేల్చింది. 'దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఈ ఉద్రిక్త సమస్యపై కేంద్రమే నిర్ణయం తీసుకోగలుగుతుంది', 'కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు పార్లమెంటే అత్యుత్తమ వేదిక' అని స్పష్టం చేయడం ద్వారా శ్రీకృష్ణ కమిటీ, మళ్లీ బంతిని కేంద్రం కోర్టులోనే వేసింది.
అయితే... ఈ విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని... జాప్యం జరిగే కొద్దీ ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తన ప్రతిపాదనలపై నిర్దిష్ట కాలపరిమితిలోపు చర్యలు తీసుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేసింది. తొలి మూడు ప్రతిపాదనలను కమిటీయే తోసిపుచ్చడంతో... బరిలో మూడు ఆప్షన్లు మాత్రమే మిగిలాయి. కానీ... కేంద్రం ఈ నెలలో అఖిలపక్షంతో జరిగే తదుపరి సమావేశంలో 5, 6 ఆప్షన్లను మాత్రమే చర్చకు పెట్టే అవకాశముంది.
విభజనను సూచిస్తున్న 5వ మార్గాంతరంపై ఇప్పట్లో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం అంతగా లేనందున, 6వ ప్రతిపాదన (తెలంగాణకు రాజ్యాంగ రక్షణల) వైపే కేంద్రం మొగ్గు చూపించవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'యథాతథ పరిస్థితి అసాధ్యం' అంటూనే, కలిపి ఉంచేందుకు ఏకైక మార్గంగా కమిటీ సూచించిన ఆరో ప్రతిపాదననే (తెలంగాణకు రాజ్యాంగ రక్షణలు) కేంద్రం తరుణోపాయంగా ఎంచుకోవచ్చని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అనిశ్చితిని ఎక్కువకాలం కొనసాగించకూడదని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో, ఈ నెలాఖరులో మరోమారు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చిదంబరం ప్రకటించారు.
ఇందులో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణకు రాజ్యాంగ రక్షణలు కల్పించడానికి కేంద్రం మొగ్గు చూపుతోందని, నివేదికలోనూ ఈ అంశమే ఉందని 'ఆంధ్రజ్యోతి' జనవరి 2వ తేదీ సంచికలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన కీలకమైన సామాజిక, ఆర్థిక ఆందోళనలను పరిష్కరించేందుకు రాజ్యాంగ, చట్టపరమైన చర్యలను తీసుకోవడమే సరైన పరిష్కారమని కమిటీ పేర్కొంది.
1956 పెద్ద మనుషుల ఒప్పందం స్ఫూర్తితో, తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పరచి, హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి బాధ్యతల్ని ఈ మండలికి అప్పగించి, దాన్ని సంప్రదించటం ప్రభుత్వానికి తప్పనిసరి చేయాలని సూచించింది. అయితే కమిటీ నివేదికపై తెలంగాణ వాదులు పెదవి విరిచారు. మండిపడ్డారు. మళ్లీ ఉద్యమం మొదలుపెట్టారు. హైదరాబాద్‌తో కూడిన, 1956కు పూర్వంనాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తప్ప, మరిదేనికీ అంగీకరించే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.
గన్‌పార్కులో జరిగిన మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. రాజకీయ జేఏసీతో కలసి ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. కమిటీ నివేదికను బహిష్కరిస్తున్నట్టు ఉస్మానియా విద్యార్థులు తెలిపారు. చిదంబరం తీర్పు తెలంగాణకు చితి పేర్చిందని ప్రజాఫ్రంట్ సారథి గద్దర్ ఆక్రోశించారు. నివేదిక మీద సీమాంధ్రలో స్థూలంగా సంతృప్తి కనిపించింది. తెలంగాణ, ఆంధ్ర మనసులు ముడివడడానికి ఈ నివేదిక దోహదం చేస్తుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.
కమిటీ చెప్పిందిలా...
* మాకు అప్పగించింది సామాన్యమైన పనేం కాదు. దీనికోసం భారీ స్థాయిలో పరిశోధన చేశాం.
* సమగ్ర ఆర్థికాభివృద్ధి కోణంలో తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లుగా ఆధారాలు కనిపించలేదు.
* మూడు ప్రాంతాల్లో అత్యధికంగా వెనుకబడింది రాయల సీమే అని ఆర్థిక విశ్లేషణల్లో స్పష్టమైంది.
* తెలంగాణలో అత్యధికులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారు. చెప్పుకోదగ్గ సంఖ్యలో తటస్థులూ ఉన్నారు.
* హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా సుస్థిర స్థానంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, దేశంలోని చాలా రాష్ట్రాలకంటే మెరుగ్గా ఉంటుంది.
* ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌ల హయాంలో హైదరాబాద్ చుట్టుపక్కల భూములను తెలంగాణేతరులు కొనుగోలు చేసి, బాగా సంపాదించుకున్నారు. స్థానికుల ప్రయోజనాలను వారు పరిగణనలోకి తీసుకోలేదు.
* హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రముఖ ఉత్పత్తి కేంద్రంగా మారి కోస్తాంధ్ర, రాయలసీమతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పెట్టుబడిదారులను ఆకర్షించింది.
* హైదరాబాద్‌ను మినహాయిస్తే... 1993-94లో తెలంగాణ జీడీపీ 33 శాతం. 2007-08 నాటికి 35 శాతం పెరిగింది. కోస్తాలో 44 శాతంగా ఉన్న జీడీపీ 41కి, రాయలసీమలో 18 శాతం ఉన్న జీడీపీ 16 శాతానికి పడిపోయింది.
* తెలంగాణలో ప్రతి వెయ్యిమందిలో 123 మందికి, కోస్తాలో 79, రాయలసీమలో 104 మందికి ప్రభుత్వం ఉపాధి కల్పించింది.
* పెద్ద మనుషుల ఒప్పందం, రాష్ట్రపతి ఉత్తర్వులు సరిగా అమలు కాని సమయంలోనే ప్రత్యేక రాష్ట్ర ఆందోళన ఊపందుకుంది.
* కొన్నేళ్లుగా కొనసాగుతున్న వలసలవల్ల హైదరాబాద్ నగర జనాభా ముఖచిత్రం మారిపోయింది.
* తమ భూ వనరులను దోచుకుని, తమను వెనక్కి నెట్టేసింది రాయలసీమకు చెందిన రాజకీయ నాయకత్వమేనని తెలంగాణ వాదులు గట్టిగా భావిస్తున్నారు.
* ఉత్తర తెలంగాణలోని కొండప్రాంతాల గిరిజనుల్లో అత్యధికులు ప్రత్యేక మన్యసీమను కాంక్షిస్తున్నారు.
* 1956లో షరతులకు లోబడే ఆంధ్రలో తెలంగాణ విలీనం జరిగింది. ఇతర ప్రాంతాలతో సమానంగా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు ఉద్దేశించిన పెద్ద మనుషుల ఒప్పందం పూర్తిస్థాయి లక్ష్యాలు సాధించలేకపోయింది.

No comments:
Post a Comment