*చట్టబద్ధ అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటుకు సూచన*ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వంటి పదవులిస్తే ఆ ప్రాంతీయుల్లో విశ్వాసం నెలకొంటుంది*తప్పనిసరైతేనే విభజన; అదీ అన్ని ప్రాంతాల ఆమోదంతోనే*అదే జరిగితే దేశవ్యాప్తంగా ఎన్నో డిమాండ్లొస్తాయి*ఐదు జిల్లాలతో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటూ మరో ప్రతిపాదన... అలా చేస్తే మిగిలిన ప్రాంతాన్ని తెలంగాణ, సీమాంధ్రలుగా విభజించవచ్చు*రెండింటికీ రాజధానులను కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయెచ్చు*తొలి సంపుటిలో శాంతిభద్రతలను విశ్లేషించిన 8వ అధ్యాయం సీల్డ్‌కవర్లో హోం మంత్రికి. మిగతా అధ్యాయాలన్నీ బయటకు... రెండో సంపుటిలో అనుబంధ సమాచారం
కలసి ఉండటమే ఉత్తమం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే అత్యుత్తమ మార్గం. అయితే తెలంగాణ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చట్టబద్ధ అధికారాలుండే ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలి. దానికి తగినన్ని నిధులివ్వాలి. కేబినెట్ హోదాతో చైర్మన్‌ను నియమించాలి. ఈ ప్రాంతానికి రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వటం కోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వంటి కీలక పదవులనివ్వాలి. తద్వారా తెలంగాణ ప్రజల్లో విశ్వాసాన్ని నింపాలి.
- ఇదీ 11 నెలలపాటు రాష్టమంతా విసృ్తతంగా పర్యటించి... విభిన్న గ్రూపులను సంప్రదించి... ప్రజా సంఘాలతో మాట్లాడి... రాజకీయ పార్టీలతో సమాలోచనలు జరిపి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ చేసిన ప్రతిపాదనల్లోని ముఖ్యమైన సూచన. డిసెంబర్ 30న కేంద్ర హోంమంత్రి చిదంబరానికి సమర్పించిన ఈ నివేదికలో కమిటీ వివిధ అంశాలను విశ్లేషిస్తూ చివరకు ఆరు ప్రతిపాదనలు చేసింది. దాన్లో ఆఖరుదైన పైన పేర్కొన్న ఆరవ సూచనే తమ ముందున్న అత్యుత్తమ మార్గమని కమిటీ స్పష్టం చేసింది. సమైక్యాంధ్రకు ఓటువేసిన ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే తెలంగాణలో నిరసనలు తప్పకపోవచ్చని, పలుప్రాంతాల్లో వ్యతిరేకత ఎదురవుతుందని, అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే ఆచరణీయ మార్గంగా కనిపిస్తోందని తేల్చిచెప్పింది.
ఒకవేళ అనివార్యంగా రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే తెలంగాణను, సీమాంధ్రను రెండు రాష్ట్రాలుగా విడదీయాలని, సీమాంధ్ర సొంత రాజధానిని అభివృద్ధి చేసుకునేదాకా హైదరాబాద్‌నే ఉవ్ముడి రాజధానిగా కొనసాగించాలని స్పష్టంచేసింది. ఈ సిఫారసును అమలు చేయాల్సి వస్తే సీమాంధ్రలో తీవ్రస్థాయి నిరసనలను చవిచూడాల్సి వస్తుందని, పెపైచ్చు ఇదే అదనుగా మున్ముందు మరిన్ని చిన్న రాష్ట్రాల కోసం డిమాండ్లు తలెత్తుతాయని, ఖర్చుపరంగా... భద్రతపరంగా ఇవి అభిలషణీయం కాదని పేర్కొంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయితే తలెత్తే పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన కమిటీ... ‘‘ఇదేమంత అభిలషణీయమైన పరిష్కారం కాదు. అయినా సరే అనివార్యంగా విభజించాల్సి వస్తే అది మూడు ప్రాంతాల ప్రజల ఆమోదంతో జరగాలి’’ అని ముక్తాయించింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 67 మండలాలు, 1,330 గ్రామాలతో కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయటం... మిగిలిన భాగాన్ని తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలుగా విభజించటమనే ప్రతిపాదన పట్ల కూడా కమిటీ సానుకూలత వ్యక్తంచేసింది. అలాగైతే కేంద్రపాలిత ప్రాంతం నుంచి నేరుగా రాకపోకలు సాగించటానికి కోస్తాంధ్ర, రాయలసీమ వాసులకు అవకాశం ఉంటుందని, రెండు ప్రాంతాలకూ హైదరాబాద్‌లోనే రాజధానులను ఏర్పాటు చేయవచ్చని సూచించింది. ‘‘కానీ దీనికి తెలంగాణ ప్రాంతం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. హైదరాబాద్ లేని తెలంగాణను వారెట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరు’’ అని కమిటీ స్పష్టం చేసింది.
రాష్ట్రాన్ని ప్రస్తుతం ఉన్నట్లుగా యథాతథంగా ఉంచటమనే సిఫారసు చేసినా... ఏ జోక్యమూ లేని ఈ ప్రతిపాదనపై తెలంగాణలో ఉదృతమైన ఆందోళనలు రేగవచ్చని, అందుకని ఇది ఏవూత్రం ఆచరణ సాధ్యం కాదని కమిటీయే స్పష్టంచేసింది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి రెండు రాష్ట్రాలుగా విభజించటం... రాయలసీమ తెలంగాణలను ఒక రాష్ట్రంగా, సీమాంధ్రను మరో రాష్ట్రంగా ప్రకటించటం వంటి ప్రతిపాదనలను చేస్తూ... వీటిపై తెలంగాణలో తీవ్రస్థాయి నిరసనలొస్తాయని, ఇవెంతమాత్రమూ ఆచరణయోగ్యం కావని కమిటీయే తేల్చిచెప్పటం గమనార్హం.
తొమ్మిదవ అధ్యాయంలో కీలక ప్రతిపాదనల్ని చేసిన కమిటీ... మిగిలిన 8 అధ్యాయాల్లో పలు అంశాలను స్పృశిస్తూ వ్యాఖ్యానాలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను మూడు భాగాలుగా విడదీసి ప్రస్తావించిన తొలి అధ్యాయంలో... ‘‘పెద్దమనుషుల ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేయకపోవటం వల్లే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి’’ అని గట్టిగా అభిప్రాయపడింది. 2వ అధ్యాయంలో ప్రాంతీయ ఆర్థిక అసమానతలను విశ్లేషిస్తూ...
‘‘రాష్ట్రంలో అన్నిటికన్నా వెనకబడింది రాయలసీమే. అది తెలంగాణ కన్నా కూడా వెనకబడింది. తెలంగాణలో కూడా హైదరాబాద్‌పై దృష్టిపెట్టారు తప్ప మిగతా ప్రాంతాలపై కాదు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లతో పోలిస్తే తెలంగాణ జీడీపీ ఎక్కువే’’ అని స్పష్టంచేసింది. గతంలో తెలంగాణ నిరాదరణకు గురైన మాట నిజమేనని ఇపుడు ఆ పరిస్థితి లేదని స్పష్టంచేసింది.
విద్య-ఆరోగ్యంపై విశ్లేషించిన 3వ అధ్యాయంలో... 1971 తరవాత తెలంగాణలో మిగతా ప్రాంతాలకన్నా ఎక్కువ అక్షరాస్యత నమోదవుతోందని, విద్యాసంస్థల విషయంలోనూ పరిస్థితి బాగా మెరుగుపడిందని పేర్కొంది. సాగునీటి విషయంలో రాష్ట్రంలో ఏ ప్రాంతమూ నిర్లక్ష్యానికి గురి కాలేదని 4వ అధ్యాయం తేల్చిచెప్పగా... ఉద్యోగాల గురించి ప్రస్తావించిన 5వ అధ్యాయంలో మాత్రం... వీటిపై కాస్త సమతుల్యత పాటించాలని సూచించారు. తెలంగాణ ఉద్యోగార్థులకు ప్రస్తుతం ఉన్న రక్షణాత్మక చర్యలు సమర్థంగా అమలు చేయాల్సి ఉందని, కొత్త చర్యలేవీ అవసరం లేదని కమిటీ తేల్చిచెప్పింది కూడా.
సాంస్కృతిక వైరుధ్యాలను 6వ అధ్యాయంలో ప్రస్తావించిన కమిటీ... ‘‘తెలంగాణ యాసను సినిమాల్లో గేలిచేస్తున్నారనే భావన వారిలో ఉంది. వారిలోనే కాదు. ఉత్తరాంధ్రలోనూ ఇదే భావన ఉంది. ఒక ప్రాంతం మరో ప్రాంతంపై సాంస్కృతికంగా పెత్తనం చెలాయిస్తూ ఉపాధిపరంగా, రాజకీయంగా వారిని అణగదొక్కే ప్రయత్నం చేసినపుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని విస్పష్టంగా పేర్కొంది. 7వ అధ్యాయంలో హైదరాబాద్ ప్రాధాన్యాన్ని వివరించిన కమిటీ... 8వ అధ్యాయంలో మాత్రం శాంతిభద్రతలు, నక్సలైట్లు తదితరాంశాలపై కీలక సూచనలు చేసింది. కాకుంటే ఈ అధ్యాయాన్ని నేరుగా సీల్డ్ కవర్‌లో పెట్టి హోంమంత్రి చిదంబరానికి అందజేసింది. ప్రతిపాదనలు- ‘శ్రీకృష్ణ’ వ్యాఖ్యలు
1 రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం
వ్యాఖ్య: పరిస్థితి సంక్లిష్టత దృష్ట్యా ఇది ఆచరణసాధ్యం కాదు
2 రాష్ట్రాన్ని విభజించడం. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం. రెండు రాష్ట్రాలు సొంత రాజధానులను ఏర్పాటు చేసుకోవడం.
వ్యాఖ్య: దీనికి కూడా తెలంగాణలో ఒప్పుకోరు.. అసాధ్యం
3 సీమ, తెలంగాణలను కలిపి రాయల తెలంగాణగా ఏర్పాటు చేయడం. కోస్తాను ఒక రాష్ట్రంగా విభజిం చడం. హైదరాబాద్‌ను రాయల తెలంగాణలో భాగంగా ఉంచడం.
వ్యాఖ్య: మూడు ప్రాంతాలకూ ఆమోదయోగ్యం కాబోదు
4 రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించడం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మరింత పెంచి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడం. దీంట్లో నల్గొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌ల నుంచి కొన్ని మండలాలను కలపడం.
వ్యాఖ్య: ఏకాభిప్రాయం కష్టం. నక్సలిజం పెచ్చరిల్లవచ్చు.
5 రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించి.. హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా ఉంచడం. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేయడం.
వ్యాఖ్య: అనివార్యమైతే, అంతా ఒప్పుకుంటేనే పరిశీలించాలి
6 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి, రాజకీయ సాధికారతకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం. చట్టబద్ధమైన అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం.
వ్యాఖ్య: సమస్యలున్నా, అత్యంత ఆచరణయోగ్యమైన మార్గం